ఈ మందు భేష్‌.. బ‌రువు త‌గ్గొచ్చు... గుండె సేఫ్‌

ఈ మందు భేష్‌.. బ‌రువు త‌గ్గొచ్చు... గుండె సేఫ్‌

ఒక మందు మార్కెట్‌లోకి వ‌చ్చిన త‌ర‌వాత అది ఎలా ప‌నిచేస్తోందో తెలుసుకునేందుకుక అనేక  ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బ‌రువు త‌గ్గేందుకు వాడే మందుల విష‌యంలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ మందులు గుండెపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయి. అయితే 2013లో అమెరికాలో ప్ర‌వేశ‌పెట్టిన బెల్‌విక్ అనే ట్యాబ్లెట్స్ మాత్రం చ‌క్క‌గా ప‌నిచేస్తున్న‌ట్లు వివిధ ప‌రిశోధ‌న‌ల్లో తేలింద‌ని అసోసియేటెడ్ ప్రెస్ సంస్థ ఓ వార్త క‌థ‌నం ప్ర‌చురించింది. ఈ ట్యాబ్లెట్స్ వాడిన‌ప్ప‌టి నుంచి  గుండె మ‌రింత సుర‌క్షింగా ఉంద‌ని, అలాగే బరువు త‌గ్గుద‌ల కూడా చాలా ఆశాజ‌న‌కంగా ఉంద‌ని పేర్కొంది. సాధారణంగా బ‌రువు త‌గ్గేందుకు డ‌మ్మీ పిల్స్ వాడుతుంటారు. అవి వాడ‌టం వ‌ల్ల నాలుగు నెల‌ల‌కు 2 కిలోలు త‌గ్గుతార‌ట‌. కాని బిల్‌విక్ వాడిన‌వారు నాలుగు కిలోల వ‌ర‌కు త‌గ్గిన‌ట్లు ఈ ట్యాబ్లెట్స్‌పై ప‌రిశోధ‌న‌లు చేసిన బ్రిగ‌మ్ అండ్ ఉమెన్స్ హాస్పిట‌ల్ (బోస్ట‌న్)కు చెందిన డాక్ట‌ర్ ఎరిన్ బొహులా తెలిపిన‌ట్లు ఆ వార్త సంస్థ పేర్కొంది. ప‌రిశోధ‌నా టీమ్‌కు ఈమె నాయ‌క‌త్వం వ‌హించారు.