కెప్టెన్ గా భయపడుతున్నాను...

కెప్టెన్ గా భయపడుతున్నాను...

వెస్టిండీస్‌తో రేపు జరిగే తొలి టెస్టుకు ముందు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ తనకు కొన్ని సలహాలు ఇచ్చాడని ప్రస్తుత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పాడు. తనక బిడ్డ పుట్టనుండటంతో రూట్ ఈ  మ్యాచ్ ఆడటం లేదు, అందువల్ల స్టోక్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇక నిన్న రూట్ ఒక సందేశాన్ని పంపాడు, అది 'నీ పద్దతిలో ఆడు' అని స్టోక్స్ చెప్పారు.  కానీ మ్యాచ్ సమయంలో ఎప్పుడైనా నేను సలహా కోసం రూట్ వైపు చూస్తాను అని చెప్పాడు. అయితే కరోనా నియామాల కారణంగా మేము రూట్ ను నేరుగా కలుసుకోలేము, అందుకే ఎల్లప్పుడూ  ఫోన్ లో అందుబాటులో ఉంటాను. అయితే అతను కూడా ఇంట్లో మ్యాచ్ చూస్తూ ఉంటాడని నాకు తెలుసు అని అన్నాడు. అలాగే నేను గత మూడు రోజులుగా భయపడుతున్నాను, ఎందుకంటే నేను కొంతమంది కుర్రవాళ్లకు సలహాలు అందించాల్సిన బాధ్యత నాపై ఉంది, అది కెప్టెన్‌ కర్తవ్యాలలో ఒకటి కాబట్టి తప్పదు' అని చెప్పాడు. ఇక చూడాలి మరి రేపు మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.