కోహ్లీకి షాక్... విస్డెన్ క్రికెటర్‌ గా ఇంగ్లాండ్ ఆటగాడు...

కోహ్లీకి షాక్... విస్డెన్ క్రికెటర్‌ గా ఇంగ్లాండ్ ఆటగాడు...

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కి అరుదైన గౌరవం దక్కింది. 2019లో తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్న బెన్‌స్టోక్స్.. 2020 విస్డెన్  క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. గత మూడేళ్లుగా భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధిస్తున్నాడు కానీ ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. అయితే 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఓ ఇంగ్లాండ్ క్రికెటర్‌కి విస్డెన్  గౌరవం దక్కింది. చివరిగా 2005‌లో  ఇంగ్లాండ్‌కి చెందిన "ఆండ్రూ ప్లింటాఫ్‌" విస్డెన్  క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. అయితే ఈ సారి మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ "ఎలీస్ ఫెర్రీ" ఈ ఏడాది విస్డెన్  అవార్డు గెలుచుకుంది. అయితే గత ఏడాది టెస్టుల్లో 821 పరుగులు చేసిన బెన్‌స్టోక్స్, వన్డేల్లో 719 పరుగులు చేశాడు. 2019‌లో బెన్‌స్టోక్స్ అద్భుతమైన ప్రదర్శన చేసాడు. అలాగె ఆ ఏడాది ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలవడం లో ముఖ్య పాత్ర వహించాడు.