బెన్‌ స్టోక్స్‌ : ఐపీఎల్ నిర్వహిస్తే తప్పకుండ ఆడుతా...!

బెన్‌ స్టోక్స్‌ : ఐపీఎల్ నిర్వహిస్తే తప్పకుండ ఆడుతా...!

ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. అయితే ఈ వైరస్ ప్రభావం అని రంగాలతో పాటుగా క్రీడారంగం పైన కూడా పడింది. అయితే ఈ వైరస్ కారణంగా ఒలంపిక్స్ తో సహా అని అంతర్జాతీయ క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. అయితే అందులో బీసీసీఐ ఆధ్వర్యం లో నిర్వహించే ఐపీఎల్ కూడా ఉంది. అయితే ఈ నెల 29 నుండి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ వచ్చే నెల 15 వరకు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం మన దేశం లో 21 లాక్ డౌన్  విధించిన విషయం అందరికి తెలిసందే. అయితే  ఐపీఎల్ నిర్వహిస్తే అందులో తప్పకుండ ఆడుతా అంటూ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ తెలియజేసాడు. ఓ మీడియా సమావేశం లో మాట్లాడిన స్టోక్స్‌ ఐపీఎల్ జరిగితే తప్పకుండా ఆడుతానని అయితే అందులో ఆడటానికి మా ఆటగాళ్లు అనేక జాగ్రత్తలు చెబుతారు. అయిన కూడా నిన్ను ఆ టోర్నీలో ఆడుతాను అని వెల్లడించాడు. అయితే స్టోక్స్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ప్రాతినిధ్యం వహించే విషయం అందరికి తెలిసిందే.