కెప్టెన్ గా మొదటి మ్యాచ్ ఓటమి పై స్టోక్స్... 

కెప్టెన్ గా మొదటి మ్యాచ్ ఓటమి పై స్టోక్స్... 

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ కు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మొదటిసారి కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఆ పరాజయం తరువాత, కెప్టెన్సీ తన ఆటపై ఎటువంటి ప్రభావం చూపలేదని  స్టోక్స్ అన్నాడు. తొలి టెస్టు ఆఖరి రోజున వెస్టిండీస్ మొత్తం 200 పరుగులు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టుపై 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్ తరువాత, రెండవ ఇన్నింగ్స్‌లో స్టోక్స్ కెప్టెన్ గా ఒత్తిడికి గురయ్యాడు అని వార్తలు వచ్చాయి, కానీ కెప్టెన్సీ తనను మార్చలేదని ఈ ఆల్ రౌండర్ స్పష్టం చేశాడు. స్టోక్స్ మాట్లాడుతూ...  ''జో రూట్ ఇంట్లో ఉండటంతో నేను పోషించిన కెప్టెన్ పాత్రను పూర్తిగా ఆనందించాను. కొంతకాలం క్రితం జట్టును నడిపించడం గురించి తెలుసుకున్నాను" అని స్టోక్స్ చెప్పారు. బంతితో, స్టోక్స్ మొదటి టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాత్ తో తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. ఇక ఈ సిరీస్ లో యొక్క రెండవ టెస్ట్ జూలై 16 నుండి ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతుంది.