ధోని లో కసి కనిపించలేదు : బెన్ స్ట్రోక్స్

       ధోని లో కసి కనిపించలేదు : బెన్ స్ట్రోక్స్

టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని అంటే బెస్ట్ ఫినిషర్ అని అందరికి తెలుసిందే. అయితే వరల్డ్ కప్ లో ధోనీ ఆడిన తీరే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ధోని తన స్టైల్ కి బిన్నంగా రక్షణాత్మక ధోరణిలో ఆడి విమర్శలపాలయ్యాడు. తాజాగా ఈ విషయంపై ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన పుస్తకం 'ఆన్ ఫైర్' లో స్పందించాడు.11 ఓవర్లలో 112 పరుగులు చేస్తే గెలుస్తారన్న దశలో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీలో పరిస్థితికి తగిన కసి, ఊపు కనిపించలేదని, భారీ షాట్లు కొట్టే బదులు సింగిల్స్ తోనే సరిపెట్టుకోవడం కొత్తగా అనిపించిందని పేర్కొన్నాడు. ఆ సమయంలో ధోనీతో పాటు క్రీజులో ఉన్న కేదార్ జాదవ్ సంగతి సరేసరి. అతడు కూడా మందకొడిగా కనిపించాడు. మ్యాచ్ అంతా అయిపోయాక కోహ్లీ బౌండరీ లైన్ నిడివిపై వ్యాఖ్యలు చేయడం వింతగా అనిపించింది. బౌండరీ లైన్ రెండు జట్లకు ఒకే నిడివితో ఉన్నప్పుడు ఒక జట్టే లాభపడుతుందనడంలో అర్థంలేదు. కోహ్లీ అలా ఎందుకన్నాడో అర్థం కాలేదు...అంటూ స్ట్రోక్స్ పేర్కొన్నాడు . ఇక విడుదలకు ముందే ఈ పుస్తకంపై క్రికెట్ అభిమానుల్లో చర్చ మొదలయింది.