2019లో బెస్ట్ జోక్ : ప్రియురాలి ఇంటికి వెళ్లి మత్తుమందు ఇచ్చాడు.. ఆ తరువాత వాటిని దోచుకెళ్ళాడు...  

2019లో బెస్ట్ జోక్ : ప్రియురాలి ఇంటికి వెళ్లి మత్తుమందు ఇచ్చాడు.. ఆ తరువాత వాటిని దోచుకెళ్ళాడు...  

2019 వ సంవత్సరం చివరికి వచ్చింది.  ఈ సంవత్సరంలో జరిగిన సంఘటనల ఒక్కసారి రివైండ్ చేసుకుంటే... ఈ ఏడాది దేశంలోని ప్రజలను ఎక్కువగా ఇబ్బందులు పెట్టింది ఉల్లి అంశం.  కొన్ని సంఘటనలు ఇబ్బందులకు గురి చేసినా... జాతీయ స్థాయిలో అవి అనుకున్నంతగా ఫోకస్ కాలేదు.  ఉల్లిపాయ దేశవ్యాప్తంగా జోకులు పేలిపోయాయి.  కన్నీళ్లు పెట్టించిన ఉల్లి...నవ్వుద్వారా కూడా కన్నీళ్లు తెప్పించింది.  

ఇక వాట్సాప్ లో ఉల్లి అంశంపై వేలాది జోకులు పేలాయి.  అందులో కొన్ని బెస్ట్ అని చెప్పొచ్చు.  అలాంటి బెస్ట్ జోకుల్లో ఇదొకటి.  వాట్సాప్ ద్వారా ఓ వ్యక్తికి ఓ అమ్మాయి పరిచయం అయ్యింది.  ప్రేమించిన అమ్మాయి కోసం ఆమె ఇంటికి వెళ్ళాడు.  అలా వెళ్లిన ఆ ప్రేమికుకు ప్రియురాలికి మత్తుమందు ఇచ్చాడు.  ఇంట్లో ఒంటరిగా ఉన్నది.  పైగా మత్తులోపడిపోయి ఉన్నది.  ఆ సమయంలో అందరి ఆలోచనలు ఒకలానే ఉంటాయి.  కానీ, ఆ ప్రేమికుడి ఆలోచన వేరుగా ఉన్నది.  ప్రియురాలు మత్తులో పడిపోయిన తరువాత వంటగదిలోకి వెళ్లి... వాళ్ళు భద్రంగా దాచుకున్న రెండు కేజీల ఉల్లిని ఎత్తుకొని అక్కడి నుంచి ఉడాయించాడట.  ఇది రియల్ గా జరిగింది కాదు.  ఉల్లిపై వచ్చిన జోక్ మాత్రమే.  అమ్మాయి వద్దు ఉల్లి ముద్దు అని చెప్పేందుకు ఈ జోక్ ను క్రియేట్ చేశారు.  ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.