వలపులతో వల వేయొచ్చు..! బాబాపేరుతో ఉచ్చులో దింపుచ్చొ..! జాగ్రత్త..!

వలపులతో వల వేయొచ్చు..! బాబాపేరుతో ఉచ్చులో దింపుచ్చొ..! జాగ్రత్త..!

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్విభజనను జీర్ణించుకోలేకపోతోనున్న పాకిస్థాన్.. తనకు ఉండే ఏ అవకాశాన్నీ వదలడం లేదు.. తన వక్రబుద్ధిని మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటోంది. భారత ఆర్మీ రహస్యాలు దొంగిలించడానికి అడ్డదారులు తొక్కుతోంది. మన సైనికులపైకి అమ్మాయిల ముసుగుతో వల విసురుతోంది.. ఇక అమ్మాయిలకు లొంగని వారిని.. భక్తి ముసుగులో ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ కుట్రల కోసం సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది దయాది ఆర్మీ.. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ పసిగట్టింది.. కుటుంబానికి దూరంగా ఉంటూ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లకు మత్తుగా మాటలు చెప్పి.. ట్రాప్ చేస్తోంది. జవాన్లు మాయలో పడిపోయాక.. సైనిక, ఆయుధ స్థావరాల వివరాలను కూపీ లాగుతున్నారని.. తరచూ ఇటువంటి ఘటనలు ఎక్కువ కావడంతో భారత ఆర్మీ దీనిపై అప్రమత్తం అయింది. భారత్ జవాన్లకు కొన్ని జాగ్రత్తలు చెబుతూ అడ్వైజరీ జారీ చేసింది.

ఇక, తాజాగా రాజస్థాన్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు పాక్ ఆర్మీ హనీట్రాప్‌లో  పడగా.. లాన్స్‌ నాయక్ రవి వర్మ, సిపాయి విచిత్ర బెహెరా పాక్ ఇంటెలిజెన్స్‌ వలలో చిక్కారని గుర్తించి రాజస్థాన్ పోలీసులు వారిని అరెస్టు చేశారు.. ఇప్పటికే హనీ ట్రాప్ ఐడీలను ట్రాక్ చేస్తున్న మన ఆర్మీ.. వారిని పట్టుకోగలిగింది. సీరాత్ అనే ఐడీ నుంచి మహిళ ఫొటోతో వాళ్లని లోబరుచుకుని ఆర్మీ రహస్యాలను దొంగిలించే ప్రయత్నం చేసినట్లు ఇండియన్ ఆర్తీ గుర్తించింది. మరోవైపు పాక్ కుట్రలను పసిగట్టిన భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ మన జవాన్లను అప్రమత్తం చేసింది. సైనికులను ఎలా వలలోకి లాగుతోందన్న దానిపై హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. వలపులతో వల విసరవచ్చు.. అలాగే బాబాలమంటూ, ఆధ్యాత్మిక గురువులమంటూ కూడా ట్రాప్ చేసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సైనికులను హెచ్చరిస్తోంది ఇండియన్ ఆర్మీ.