రాజమౌళి చేతుల మీదుగా భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు ట్రైలర్ 

రాజమౌళి చేతుల మీదుగా భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు ట్రైలర్ 

కమెడియన్ హీరో వైశ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా భాగ్యనగరం వీధుల్లో గమ్మత్తు.  కామెడీ ప్రధానాంశగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను రాజమౌళి కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు.  కమెడియన్ గా వెండితెరకు పరిచయమైనా శ్రీనివాస్ రెడ్డి, ఆ తరువాత కమెడియన్ హీరోగా పరిచయం అయ్యారు.  

ఇప్పుడు నిర్మాతగా, దర్శకుడిగా మారి ఈ సినిమా చేస్తున్నారు.  వెన్నెల కిషోర్ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు.  డ్రగ్స్, కారు, మాఫియా చుట్టూ కథ నడుస్తుంది.  ఆ మూడింటికి.. శ్రీనివాస్ రెడీ బ్యాచ్ కు ఉన్న సంబంధాన్ని కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు.  ట్రైలర్ పర్వాలేదనిపించింది.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 6 వ తేదీ వరకు ఆగాల్సిందే.