రివ్యూ : భైరవగీత 

రివ్యూ : భైరవగీత 

నటీనటులు : ధనుంజయ్, ఇర్రా మోర్, రాజా బల్వాడి తదితరులు

సంగీతం : రవి శంకర్

సినిమాటోగ్రఫీ : జగదీశ్

నిర్మాత : అభిషేక్ నామా

దర్శకత్వం : సిద్దార్ధ్

విడుదల తేదీ : 14-12-2018

రామ్ గోపాల్ వర్మ సినిమాలు వరసగా పరాజయం పాలౌతుండటంతో.. తన శిష్యులతో కలిసి వర్మ సినిమాలు చేయడం మొదలుపెట్టాయి.  వర్మ శిష్యుల్లో ఒకరు ఆర్ఎక్స్ 100 సినిమా తీసి సక్సెస్ అయ్యారు.  ఇప్పుడు సిద్దార్ధ్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో భైరవగీత అనే సినిమాను తెరకెక్కించాడు.  ఈ సినిమా ఈరోజు రిలీజ్అయింది.  మరి ఇది ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.  

కథ : 

హీరో ధనుంజయ్ రాయలసీమలో ఓ తక్కువ  కులానికి చెందిన వ్యక్తి.   ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు తరతరాలుగా గ్రామ పెద్ద సుబ్బారెడ్డి వద్ద బానిసల్లా పనిచేస్తుంటారు.  సుబ్బారెడ్డిది ఫ్యాక్షన్ కుటుంబం.  నిత్యం పగలు ప్రతీకారాలంటూ తిరుగుతుంటారు.  సుబ్బారెడ్డి కూతురు ఇర్ర మోర్.  ఓరోజు ఆమెపై శత్రువులు ఎటాక్ చేస్తారు.  ఆ సమయంలో సుబ్బారెడ్డి కూతురును ధనుంజయ్ కాపాడతాడు.  దీంతో ఇర్ర మోర్.. ధనుంజయ్ ప్రేమలో పడుతుంది.  ఈ విషయం సుబ్బారెడ్డికి తెలిసి వ్యతిరేకిస్తాడు.  బానిసలకు పెద్దింటి వాళ్ళతో సంబంధమా అని కోపగించుకుంటారు.  దీంతో ధనుంజయ్ బానిసత్వాన్ని వ్యతిరేకిస్తాడు.  సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా తన వర్గాన్ని ఒక్కటి చేసి.. ఎలా తన ప్రేమను గెలిపించుకున్నాడు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

రామ్ గోపాల్ వర్మ శిష్యులు తీసే సినిమాలు గురువుగారి సినిమాలు దగ్గరగా ఉంటాయని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది.  వర్మ సినిమాల్లో కనిపించే హింసా, రక్తపాతం, బోల్డ్ సన్నివేశాలు ఇందులో కూడా ఉంటాయి.  కాకపొతే ఇందులో ఇంకాస్త హింసా రక్తపాతం స్థాయి మరింతగా పెరిగింది. కల్ట్ లుక్ లో  ధనుంజయ్ యాక్టింగ్ ఆకట్టుకునే విధంగా ఉంది.   బానిసలకు ప్రేమించే అర్హత లేదని విలన్ చెప్పినపుడు హీరో రియాక్షన్, ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో ధనుంజయ్ యాక్టింగ్ బాగుంది.  హీరోయిన్ ఇర్ర బోల్డ్ సన్నివేశాలలో ఎలాంటి బెరుకు లేకుండా నటించి మెప్పించింది.  లవ్ యాక్షన్ సినిమా అని మొదటి నుంచి ప్రచారం చేస్తున్న వర్మ అండ్ కో ఇందులో ప్రేమ కనిపించలేదు.  కేవలం రొమాంటిక్ యాక్షన్ మాత్రమే కనిపించింది. యాక్షన్ లోను రక్తపాతమే ఎక్కువగా కనిపించడం విశేషం. పాయింట్ బాగున్నా దాని చుట్టూ అల్లుకున్న కథనాల్లో హింసని ఎందుకు ఎంచుకున్నారో అర్ధం కాలేదు.  

నటీనటుల పనితీరు : 

ధనుంజయ్, ఇర్ర మోర్ లు సినిమాకు ప్లస్ అయ్యారు.  ధనుంజయ్ మాస్ యాక్షన్ తో ఆకట్టుకుంటే, ఇర్ర తన అందచందాలతో ఆకట్టుకుంది. హీరోయిన్ తండ్రి నటన బాగుంది.  

సాంకేతిక వర్గం పనితీరు : 

సిద్దార్ద్ కొత్త దర్శకుడే అయిన్పటికీ వర్మ శిష్యుడు కావడంతో అవకాశం వచ్చింది.  మంచి కథను ఎంచుకున్నా.. దానిని తెరకపై మలిచిన తీరు సరిగాలేదని చెప్పొచ్చు.  ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయింది.  రవి శంకర్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. 

పాజిటివ్ పాయింట్స్ : 

నటీనటులు 

కథ 

ఫోటోగ్రఫి 

నెగెటివ్ పాయింట్స్ : 

కథనాలు 

మితిమీరిన రక్తపాతం 

చివరిగా : భైరవగీత - రక్తపాతానికి పరాకాష్ట