కోటిదీపోత్సవం.. ఇల కైలాసంలో నేటి కార్యక్రమాలు..

కోటిదీపోత్సవం.. ఇల కైలాసంలో నేటి కార్యక్రమాలు..

ఇల కైలాసంగా మారిన ఎన్టీఆర్ స్టేడియం పరిసరప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. రోజురోజుకూ పెరిగిపోతున్న భక్తులతో ఎన్టీఆర్ స్టేడియం కిటకిటలాడుతోంది... 13 రోజులు విజయవంతమైన కోటిదీపోత్సవం.. 14వ రోజుకు చేరుకుంది.. ఇవాళ్టి క్రతువులో భాగంగా కోటిదీపోత్సవ వేదికపై కలియుగ ప్రత్యక్షదైవం, కొలిచినవారి కొంగుబంగారం శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీనివాసుడుకి పల్లకి సేవ నిర్వహిస్తారు... ఇక, తుని తపోవనం శ్రీ సచ్చిదానంద సరస్వతి అనుగ్రహణ భాషణం ఉంటుంది... ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భక్తిటీవీ కోటిదీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.