బాధ్యతగా సినిమా చేశాం 

బాధ్యతగా సినిమా చేశాం 

యాంకర్: బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న 'భరత్ అనే నేను' టీంకు శుభాకాంక్షలు. ఓవైపు ఆడియన్స్ హార్ట్స్ ను కొల్లగొడుతూనే.. బాక్సాపీస్ ను కూడా షేక్ చేస్తున్న ఈ సినిమాలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను టీంను అడిగి తెలుసుకుందాం. యాంకర్ మంజూష అనే నేను ఎంతో ఇంఫర్మేటిక్ గా.. మరెంతో ఎంటర్టైన్ గా ఇంటర్వ్యూ చేస్తానని హామీ ఇస్తున్నాను.
'భరత్ అనే నేను' టీం: కొరటాల శివ, కైరా అడ్వానీ, మహేశ్ బాబు    
యాంకర్: సీఎంగా.. సరికొత్తగా.. కత్తిమీద సాము లాంటి పాత్ర అనగానే  ముందు మీరు ఎలాంటి బాధ్యతతో కూడిన భయాన్ని అనుభవించారు? 
మహేశ్ బాబు: చాలా షాక్ అయ్యాను. మొదట శివగారు ఓ ఐడియా చెప్తానని వచ్చి.. ఓ అరగంట ఏవేవో విషయాలు చెప్పి ఆ తర్వాత మీరు సీఎం పాత్ర చేయాలన్నారు. నేను ఓ ఐదు నిమిషాలు నవ్వుకున్నాను సరదాగా అనుకొని. ఆ తర్వాత లేదు... అని ఓ అర్దగంట సినిమా నెరేట్ చేశారు. చాలా పవర్ ఫుల్ థాట్. వెంటనే ఓకే.. చేద్దాం అన్నాను. అంతే కాకుండా ఐదు గంటలు సినిమా నెరేట్ చేశాక ఐదు గంటలు సినిమా చేద్దాం సార్ అన్నాను. ఎందుకంటే అంత పవర్ ఫుల్ కంటెంట్ ఆ కథలో ఉంది. చాలా గొప్ప సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. పార్ట్ 2 ఎప్పుడు సార్ అంటున్నారు అస్టెంట్ డైరెక్టర్స్. 
యాంకర్ : సీఎంగా మీరు ఎంత బాధ్యతతో కూడిన ఫైట్స్ గట్రా చేయడం ఎలా అనిపించింది? 
మహేశ్ బాబు : సీఎం పైట్స్ ఎలా చేస్తాడు... సీఎం కత్తి పట్టుకొని నిల్చోవడం ఏంటి? అనేది ఇంత పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో అంత క్లాస్ గా కథను తీసుకెళ్లడం అంటే అది శివగారికే చెల్లింది. అందులో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి బ్లాక్ బస్టర్ రేంజ్ కి సినిమాని తీసుకెళ్లడం అద్భుతమనే చెప్పాలి. 
యాంకర్ : సీఎంగా బాధ్యత గల నాయకుడుగా .. అదే సమయంలో లవ్ స్టోరీని నడిపించడం రెండింటినీ అతికినట్టు కాకుండా ఇంత గొప్పగా ఎలా హ్యాండిల్ చేశారు. 
కొరటాల శివ: సీఎంగా అంటే లాజిక్స్ తో పాత్రను నడిపించాలి. దుర్గామహల్ లో సీఎంతో ఫైట్ చేయించడం ఈజీనే... కానీ... అక్కడ ప్రేక్షకులు సీఎం ఫైట్ చేస్తే బాగుండు అని సన్నివేశాన్ని కల్పించి ఫైట్ చేయించడం చాలా గొప్పగా బిల్డ్ చేయాల్సి వచ్చింది. అందుకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది ఈసినిమాకి. వెంటనే.. మహేశ్ కల్పించుకొని
మహేశ్ బాబు: ఆ సీన్ లో బ్యూటీ ఏంటంటే  సెక్యూరిటీ.. పర్మిషన్ అడగడం వంటివి.. నాకో పర్మిషన్ ఇవ్వండి ఓ పది నిమిషాలు.. నన్ను నేను కాపాడుకోపోతే రాష్ట్రాన్ని ఏం కాపాడుతాను.. అనేది చాలా కొత్త యాంగిల్ గా అనిపించి ప్రవేశ పెట్టడం చాలా బాగుంది అన్నారు. 
యాంకర్ : గార్ల్ ఫ్రెండ్ ను కలిసే సీన్స్ కూడా సీఎం టైమ్ కు ఆటంకం రాకుండా పర్సనల్ టైం ఉదయం 7.30కి కలవడం ఎలా థాట్ వచ్చింది?
మహేశ్ : కొరటాలగారి థాట్ అది. మార్నింగ్ కలవచ్చా.. అంటే నాకు కాలేజీ ఉంది. అయితే నాకూ ఆఫీస్ ఉంది అనేది చాలా బాగుంటుంది. 
యాంకర్ : కైరా మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఇంత హ్యాండ్సమ్ సీఎం.. గుడ్ లుకుంగ్ మహేశ్ తో? 
కైరా అడ్వానీ: చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా గొప్ప అందమున్న.. మనసున్న హీరో మహేశ్. నాకు తెలుగులో ట్రాఫిక్ డైలాగ్ తెలుసు అదేంటంటే.. ట్రాపిక్ రూల్స్ విషయంలో మీరింత హార్స్ గా ఉండటం రియల్లీ గ్రేట్... 
యాంకర్ : సీఎం అనగానే రకరకాల విషయాలు మూడుగంటల నిడివిలో ఎలా ఫిల్టర్ చేసుకున్నారు? 
కొరటాల శివ: స్టడీ ఇష్యూను, వైద్యం వంటివి అన్నీ జెన్యూన్ గా కథను నడిపాను. కథలో అన్నీ సంలీనమైపోయేలా సినిమాను నడిపించాను. అందుకు మా టీం చాలా కష్టపడ్డారు. 
యాంకర్ : సీఎంగా చేస్తున్నప్పుడు బాడీ లాంగ్వేజీ, భాష వంటి వాటిని ఎలా మీరు అద్భుతంగా వచ్చేలా చేయగలిగారు.? 
మహేశ్ బాబు: శివగారు ఈ సినిమాలో ఓ కొత్త డైలాగ్ ఫార్మెట్ ను ఫాలో అయ్యి రాశారు. అసెంబ్లీలో డైలాగ్స్ వంటివి పలకడానికి రాకపోతే శివగారు పక్కకు తీసుకుపోయి చెప్పడం వంటివి చేశారు. అందుకే అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. 
యాంకర్ : కైరా క్యారెక్టర్ లో ఎంత బాగా ఒదిగిపోయింది అనుకుంటున్నారు మీరు? 
మహేశ్ బాబు: చాలా అందంగా కూర్చుండిపోయారు. అస్సలు సెకండాఫ్ లో ఓ స్టేజ్ తర్వాత కైరా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కీలకంగా నిలిచింది. ఈ స్టోరీకి ఇంకో మలుపులాంటిది ఆమె క్యారెక్టర్.  అందుకనే కొత్తమ్మాయి. కొత్తలుక్ ఉండాలని అంతా డిసైడై కైరాను అనుకొన్నాం. 
యాంకర్ : కథలో సమస్యలకు అందంగా పరిష్కారాలను చూపించడం ఎలా సాధ్యమైంది.?
మహేశ్ బాబు : ఈ సినిమాకు అందం అదే .. పరిష్కారాలతోటే కథను నడిపించగలగడం. 
యాంకర్: కైరా టాలీవుడ్ లోని మీ కొత్త అనుభవం... అద్భుతమైన సినిమా టీంతో మీకు ఎలా అనిపించింది. 
కైరా అడ్వానీ: చాలా అద్భుతమైన అనుభవం నాకు. నాపై నమ్మకంతో నన్ను తీసుకున్న శివగారికి కృతజ్ఞతలు. ఇక్కడరావడానికి సహాయం చేసిన మహేశ్ గారికి థ్యాంక్స్. ప్రత్యేకంగా ఈ సినిమా ద్వారా తాను ఎంటర్ కావడం అపరిమితమైన ఆనందం వేస్తుంది. 
కొరటాల శివ: మహేశ్ గారి పక్కన ఏ హీరోయిన్ కి ఇంత అభినందనలు రాలేదు. అది నిజంగా కైరాకి లభించినందుకు ఆనందం. 
యాంకర్ : మీసంతో మహేశ్ ఆర్టిఫిషియల్ గా కనిపించడం చాలా ముచ్చటగానూ.. కృష్ణగారిలా కనిపించారు?
మహేశ్ బాబు : సీఎం థియేటర్ లో ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మీసం పెట్టాలన్నారు శివగారు. పెట్టి తీశాం. అద్భుతంగా కాంప్లిమెంట్స్ వస్తున్నాయ్. నాన్న గారు ఆనందంతో మనలాగే ఉన్నారు కొన్నిచోట్ల అన్నారు.  
యాంకర్: సీఎం అనగానే పంచకట్టు.. కత్తి, నాగలి పట్టుకోవడం.. మీసం వంటివి కొత్తగా అనిపించాయి? 
మహేశ్ బాబు: నిజంగా నేను చిన్నప్పటి నుండి నాన్నగారి సినిమాలే చూసేవాడిని. ఒక్కొక్కటికి 10సార్లు చూసేవాడిని. అనుకోకుండా సీఎం అనగానే ఆ డైలాగ్ డెలివరీ నాకే తెలియకుండా ఆ బాడీ లాంగ్వేజీకి తగిన విధంగా కనెక్ట్ అయిపోయాను. 
యాంకర్ : సమాజమంతా ఎలక్షన్స్ అన్న మూడ్ లో ఉన్నప్పుడు.. ఈ సినిమా రావడం.. అసెంబ్లీ ఎంతా సొసైటీ సినమా రెండింటినీ ప్రజలకు కనెక్ట్ చేసేలా ఎలా హ్యాండిల్ చేశారు
కొరటాల శివ: అంతా స్క్రిఫ్ట్. నాకు మంచి టీమ్ ఉన్నారు. సురేష్, రవికెచంద్రన్, తిరు సినిమా వాళ్లచేతిలోకి వెళ్లాక తనదై చేశారు అంతా. అందుకే అంత అద్భుతంగా వచ్చింది. 
యాంకర్ : కొన్ని సీన్స్ లో వెరీ ఎమోషన్... వెరీ ఇంటెన్షన్.. హ్యాండిల్ చేసే విధంగా చాలా మైండ్ బ్లోయింగ్ గా అనిపిస్తుంది. ఆ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 
మహేశ్ బాబు : అది తెలియని ఓ మిరాకిల్. ఆ మీడియా సన్నివేశంలో ఎమోషన్ ను మిరాకిల్ గా వచ్చింది. 
యాంకర్ : సెకండ్ టైమ్ కూడా మీ ఇద్దరి కాంబినేషన్ లో మంచి సక్సెస్ వచ్చింది. హ్యాట్రిక్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? 
మహేశ్ బాబు: తప్పకుండా చేస్తాం. నేను ఎప్పుడూ రెడీనే అన్నారు మహేశ్. మా ఇద్దరికీ ఎక్కడో కనెక్షన్. ఇరువురికి మధ్య రెస్పెక్ట్ ఉందన్నారు మహేశ్ బాబు. అలాగే.. ఇద్దరి మధ్య ఎలాంటి ఇగో లేదన్నారు. 
యాంకర్ : గొప్ప సోషల్ ఎలిమెంట్స్ ను చొప్పించి మంచి ఎంటర్టైన్ మెంట్ గల ఫిల్మ్ అందించి సక్సెస్ ను అందుకున్నందుకు శివగారికి టీం అందరికీ కృతజ్ఞతలు.. మీరు ఇంకా ఈ చిట్ చాట్ లోని మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కింది వీడియోను క్లిక్ చేయండి.