గుడ్ న్యూస్: కోవాగ్జిన్ తో న్యూస్ట్రెయిన్ ఆటకట్టు 

గుడ్ న్యూస్: కోవాగ్జిన్ తో న్యూస్ట్రెయిన్ ఆటకట్టు 

కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా స్ట్రెయిన్ కేసులతో దేశం ఆందోళన చెందుతున్నది.  పాత కరోనా వైరస్ కంటే కొత్త స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది.  ఈ కొత్త స్ట్రెయిన్ వలన బ్రిటన్ లో అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.  కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచం దీనిపై దృష్టి సారించింది.  ఇక ఇదిలా ఉంటే, ఇండియాలో భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ న్యూ స్ట్రెయిన్ వైరస్ పై సమర్ధవంతంగా పోరాటం చేస్తున్నట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. వైరస్ ను తటస్థీకరించడంతో పాటుగా, మ్యూటేషన్ చెందుతూ వైరస్ తప్పించుకునే ప్రభావాన్ని కూడా తగ్గించడంతో కోవాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని, 26 మందిపై జరిపిన ప్రయోగాల ఫలితాలే ఇందుకు నిదర్శనం అని భారత్ బయోటెక్ తెలిపింది.  ఇక కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు ది లాన్సెట్ పత్రిక కూడా పేర్కొన్నది.