ఎన్నికల తర్వాతే భారతీయుడు 2 !

ఎన్నికల తర్వాతే భారతీయుడు 2 !

 

ప్రస్తుతం శంకర్ 'భారతీయుడు 2'పై వర్క్ చేస్తున్నాడు.  ఇందులో కమల్ హాసన్ కథానాయకుడు.  లైకా ప్రొడక్షన్ సామ్సతః ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  సినిమా బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో చిత్ర షూటింగ్ ఆదిలోనే ఆగిపోయింది.  చెప్పినంత బడ్జెట్లో సినిమా పూర్తిచేస్తానని శంకర్ మాటివ్వాలని లైకా పట్టుబట్టింది.  కానీ శంకర్ అందుకు ఒప్పుకోలేదు.  దీంతో చిత్రం ఆగింది.  మధ్యలో రాయబారాలు నడిచినా వ్యవహారం ఒక కోలిక్కి వచ్చినా ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీకి దిగుతుండటంతో మరోసారి బ్రేకులు పడ్డాయి.  ఎన్నికలు ముగిశాక కమల్ ఫ్రీ అవుతారని, అప్పుడే షూట్ మొదలవుతుందని తెలుస్తోంది.  ఇకపోతే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటించనుంది.