వ్వాటే ట్రెండ్‌: అమ్మ‌కానికి సీఎం భ‌ర‌త్ టీస్‌!

వ్వాటే ట్రెండ్‌: అమ్మ‌కానికి సీఎం భ‌ర‌త్ టీస్‌!
సీఎం భ‌ర‌త్‌ని బ‌హిరంగ మార్కెట్లో అమ్మ‌కానికి పెట్టేశారు. పాడుకున్న‌వారికి పాడుకున్నంత‌! వేలం వేసిన‌వారికి వేసుకున్నంత‌!.. సీఎం గారి బిజినెస్ ఆ రేంజులో సాగుతోంది మ‌రి! అస‌లింత‌కీ ఈ టీ-చొక్కాల అమ్మ‌క‌మేంటి.. అంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. ఈ త‌ర‌హా అమ్మ‌కాలు ఇప్పుడే కొత్త కాదు. టాలీవుడ్‌లో స్టార్‌డ‌మ్ అన్న ప‌దానికి అర్థం చెప్పిన మెగాస్టార్ చిరంజీవి అజేయమైన కెరీర్ జ‌ర్నీలో ఇలాంటి ట్రెండ్ క్రియేట్ చేసింది మెగాభిమానులే. అప్ప‌ట్లో చిరు తొడుక్కున్న చొక్కా గాల్లో గిర‌గిరా తిప్పి విసిరేస్తే ఠ‌పీమ‌ని క్యాచ్ చేసిన అభిమానులు ఉన్నారు. ఆ పిచ్చి అభిమానం ఫ‌లిత‌మే ఆ త‌ర‌వాత స్టార్ల‌కు సంబంధించిన వ‌స్తువులు వేలం వేయ‌డం అన్న ఆలోచ‌న‌కు పురుడుపోసింది. చిరంజీవి త‌ర‌వాత బాల‌కృష్ణ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్, మ‌హేష్ స‌హా చాలామంది హీరోలు ఆ స్థాయిని అందిపుచ్చుకున్నారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి స్టార్లు ధ‌రించిన దుస్తుల వేలం, సైకిల్ వేలం, లేదా బైక్ వేలం వంటివి బాగానే వ‌ర్క‌వుట‌య్యాయి. ఇదివ‌ర‌కూ శ్రీ‌మంతుడు సైకిల్‌ని ఇదే తీరుగా మ‌హేష్ వీరాభిమాని వేలంలో ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి మాత్రం వేలం కాదు కానీ, మ‌హేష్ `భ‌ర‌త్‌` టీష‌ర్టులు మార్కెట్లో ఎగ‌సిప‌డుతున్నాయ్‌. ఇదిగో సీఎం భ‌ర‌త్ స్మార్ట్ అప్పియ‌రెన్సును టీష‌ర్టుల‌పై ఇలా ప్రింట్ చేసి మార్కెట్లో పెట్టేశారు. స్టార్ల‌పై అభిమానంతో ఫ్యాన్స్ కొనుక్కుంటే, ఆ ర‌కంగా ఉపాధి ద‌క్కుతోంది. అంతా మంచి కోస‌మే..!