ఎన్‌జీఓలకు ప్రశాంత్‌ భూషణ్‌ రాజీనామా

ఎన్‌జీఓలకు ప్రశాంత్‌ భూషణ్‌ రాజీనామా

స్వచ్ఛంద సంస్థలైన సెంటర్‌ ఫర్‌ పీఐఎల్‌ (సీపీఐఎల్‌), కామన్‌ కాజ్‌, స్వరాజ్‌ అభియాన్‌ల గవర్నింగ్‌ బోర్డులకు ప్రముఖ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ రాజీనామా చేశారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వృత్తి ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ప్రశాంత్‌ భూషణ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ప్రాక్టీస్‌ చేస్తున్న లాయర్లు... తాము సభ్యులుగా ఉన్న సంస్థల తరఫున వాదించడానికి వీల్లేదు. సీపీఐల్‌, కామన్‌ కాజ్‌ వంటి సంస్థల తరఫున ప్రశాంత్‌ భూషణ్‌ వాదించడాన్ని వ్యతిరేకిస్తూ...రిటైర్డ్ మేజర్‌ ఎస్‌కే పునియా బారఖ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలకు స్పందించాల్సిందిగా ప్రశాంత్‌ భూషణ్‌కు నోటీసు ఇచ్చింది బార్‌ కౌన్సిల్‌. దీనికి స్పందిస్తూ.. తాను ఈ ఎన్‌జీఓలకు రాజీనామా చేస్తున్నానని భూషణ్‌ బదులు ఇచ్చారు.