భారత్ కు సెమీఫైనల్, ఫైనల్ ఫోబియా...!

భారత్ కు సెమీఫైనల్, ఫైనల్ ఫోబియా...!

ఫోబియా అంటే భయం. ఒకొక్కరికి ఒకోరకమైన భయం ఉంటుంది. అయితే మన భారత క్రికెట్ టీంకు మాత్రం ఓ కొత్త రకమైన ఫోబియా వచ్చిందట అదేంటంటే సెమీఫైనల్, ఫైనల్ ఫోబియా. అయితే 2014 నుండి ఇప్పటివరకు ఒక ఐసీసీ ట్రోఫీ ని కూడా అందుకోలేదు. ప్రతి టోర్నీ లో చివరి వరకు వచ్చి నిరాశపరుస్తుంది. 2014 నుండి జరిగిన అని ఐసీసీ టోర్నీ లో సెమీఫైనల్ లేదా ఫైనల్ కు వచ్చి వెనకు వచ్చేస్తుంది. 2014 లో జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీ లో ఫైనల్ లో పరాజయం చెందుతుంది టీం ఇండియా. ఈ టోర్నీ లో గ్రూప్-బి తరుపున ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా లీగ్ దశలో మొదటి స్థానం లో ఉంది సెమిస్ కు చేరుకుంది. సెమిస్ లో బలమైన దక్షిణాఫ్రికా జట్టు పై విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టిన భారత్ అక్కడ శ్రీలంక చేతిలో ఓటమి చెందుతుంది. అయితే 2011 వరల్డ్ కప్ లో కూడా ఈ రెండు టీం లే ఫైనల్ కు చేరుకోగా అక్కడ భారత్ విజయం సాధిస్తుంది. ఆ విజయానికి ప్రతీకారం ఇక్కడ తీర్చుకుంది శ్రీలంక. అయితే తరువాత 2016 ల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో కూడా సెమిస్ వరకు వచ్చి అక్కడ వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో 192 పరుగులు చేసి కూడా దానిని కాపాడుకోలేకపోతుంది. ఈ మ్యాచ్ లో లెండ్ల్ సిమన్స్... పాండ్య అలాగే అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయిన కూడా అవి నోబ్ బాల్స్ కావడం ఇండియాను దెబ్బ తీసిందనే చెప్పాలి. 

అయితే సంవత్సరం తరువాత 2017 లో జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ లో  మళ్ళీ గ్రూప్-బి నుండి మొదటి స్థానం లో నిలిచిన భారత్ సెమిస్ కు చేరుకుంటుంది. అక్కడ సెమిస్ లో బంగ్లా పై విజయం సాధించి ఫైనల్ కు అడుగు పెడుతుంది. కానీ అక్కడ ఓడిపోతుంది. అయితే భారత్ ఎక్కడ ఓడిపోయిన ఎక్కువగా నిరాశపడని అభిమానులు మాత్రం ఈ ఓటమితో మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఈ ఫైనల్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో నిర్ణిత 50 ఓవర్లలో 338 పరుగులు చేసిన పాకిస్థాన్ భారత ఆటగాళ్లను కేవలం 158 కె ఆలౌట్ చేసింది. అయితే ఈ భారత ఇన్నింగ్స్ లో పాండ్య బ్యాటింగ్ మాత్రం అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. వచ్చిన వారు అందరూ పెవిలియన్ కు వెళ్లిపోతున్నా పాండ్య మాత్రం 76 పరుగులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. 

అయితే తరువాత 2015 లో జరిగిన వరల్డ్ కప్ లో సెమిస్ లో ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది భారత్. అయితే ఆ టోర్నీ మొదలైన దగ్గరి నుండి ప్రతి మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేస్తూ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా గ్రూప్-బి మొదటి స్థానం లో నిలిచి సెమిస్ కు చేరుకుంది భారత్. సెమిస్ లో గ్రూప్-ఏ నుండి రెండో స్థానం లో ఉన్న ఆసీస్ తో తలపడి ఓటమి చెందుతుంది. అయితే లీగ్ దశాలో ప్రతి టీం ను ఆలౌట్  చేసిన ఇండియా సెమిస్ లో మాత్రం ఆసీస్ జట్టు ను ఆలౌట్ చేయలేకపోతోంది. ఈ మ్యాచ్ లో ధోని(65), ధావన్(45), రహానే(44) మినహా మిగితా ఆటగాళ్లు అందరూ విఫలం అవ్వడం గమనార్హం. ఆ తరువాత 2019 జరిగిన వరల్డ్ కప్ లోను సెమిస్ కు చేరుకున్న భారత్ న్యూజిలాండ్ తో తలపడి ఓడిపోతుంది. అయితే ఇందులో కివీస్ ఇన్నింగ్స్ తరువాత వర్షం పడింది. ఆ తరువాత ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ కు కివీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. వర్షం కారణంగా పిచ్ కొద్దిగా తడవడంతో బౌలర్లకు బాల్ బాగా స్వింగ్ అవుతుంది. దాంతో భారత బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ బాట పట్టడం తో కివీస్ పైనల్ లోకి అడుగుపెడుతుంది.

అయితే పురుషుల జట్టునే అనుసరిస్తున్నారు భారత మహిళల జట్టు. 2017 లో జరిగిన మహిళల వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు చివరి వరకు వచ్చి ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోతుంది. అంతే కాకుండా 2020 లో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ లో కూడా ఒక మ్యాచ్ ఓడకుండా సెమిస్ కు వచ్చింది భారత జట్టు. అక్కడ సెమిస్ మ్యాచ్ కు వరుణుడు అడ్డు రావడం తో ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాచ్ ఆడకుండానే ఫైనల్ కు చేరుకుంటుంది. ఫైనల్ లో అప్పటికే నాలుగు సార్లు విజేతలుగా నిలిచిన ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతుంది. అయితే ప్రతి సారి చివరి వరకు వచ్చి వెనుదిరుగుతున్న భారత్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ అలాగే నవంబర్ లో ప్రారంభం కానున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ టోర్నీ లో ఏం చేస్తుందో చూడాలి. ఎందులోనైనా విజయం సాధిస్తుందా లేక మళ్ళీ చివరకు వచ్చి ఇంటి దారి పడుతుందో చూడాలి. ప్రస్తుతం భారత దక్షిణాఫ్రికా తో ఈ నెల 12 నుండి వన్డే సిరీస్ లో ఆడనుంది.