క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన భారత స్పిన్నర్‌ "ప్రగ్యాన్‌ ఓజా"...

క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన భారత స్పిన్నర్‌ "ప్రగ్యాన్‌ ఓజా"...

భారత లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ "ప్రగ్యాన్‌ ఓజా" ఈ పేరు ఇప్పుడు ఎవరికీ పెద్దగా తెలియ పోవచ్చు కానీ ఓజా బౌలింగ్ ఎదుర్కున్న వాళ్ళు మాత్రం అతడిని మర్చిపోరు. అయితే అటువంటి స్పిన్నర్‌ "ప్రగ్యాన్‌ ఓజా" ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అయితే 2009లో శ్రీలంక పై టెస్ట్‌ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్‌ ఆరంగేట్రం చేసిన ఓజా... 24 టెస్టుల్లో 113 వికెట్లు తీశాడు. అలాగే 18 వన్డేలు ఆడిన ఓజా... 21 వికెట్లు తీశాడు. 6 టీ-20ల్లో 10 వికెట్లు తీశాడు ఓజా. అయితే  2013లో జరిగిన విండీస్‌ మ్యాచే ఓజాకు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం కొంచెం నిరాశ పరిచే విషయం. అయితే ఐపీఎల్‌ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన కూడా ఓజా కు తిరిగి తుది జట్టులో చోటుదక్కలేదు. అయితే తరువాత కొన్నిసార్లు భారత జట్టుకు ఎంపికైన కేవలం రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే ఈ రోజు  అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటూ తనకు ఇన్ని రోజులు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు ప్రగ్యాన్‌ ఓజా.