'ఆ విషయంలో టీఆర్‌ఎస్‌ది మైండ్‌ గేమ్‌..'

'ఆ విషయంలో టీఆర్‌ఎస్‌ది మైండ్‌ గేమ్‌..'

సీఎల్పీ విలీనం అంటూ టీఆర్‌ఎస్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అనర్హత అంశంపై గవర్నర్‌తో అఖిల పక్ష నేతలు భేటీ అయ్యారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయాలని కోరామని చెప్పారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందన్న భట్టి.. రాజ్యాంగాన్ని కాపాడడానికే రాజ్‌భవన్‌ ఏర్పాటు చేశారని.. అందుకే గవర్నర్‌ను కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎక్కడైనా వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.