ప్రభుత్వం ఎంతో.. మేమూ అంతే..

ప్రభుత్వం ఎంతో.. మేమూ అంతే..

సంఖ్యా బలం ఉంది కదా అని ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో బుల్డోజ్ చేస్తాం అంటే కుదరదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లుపై చర్చ చేయకుండానే పాస్ చేయించుకోవడం సరికాదన్నారు. కనీసం అంగీకరిస్తున్నారా లేదా అని కూడా అడగడం లేదన్నారు. సీఎల్పీ నాయకుడిగా చర్చిద్దాం అని అడిగితే పట్టించుకోలేదని భట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి సభా నాయకుడు సరైన గౌరవం ఇవ్వాలన్నారు. ఇటువంటి పోకడ సరికాదని.. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని భట్టి చెప్పారు. సభలో ప్రాక్టీస్..ప్రొసీజర్ అప్రజాస్వామ్యంగా నడుస్తున్నాయని.. ఇది తెలంగాణకు విఘాతం అని అన్నారు. సభలో ప్రభుత్వం ఎంత అవసరమో..ప్రతిపక్షం అంతే అవసరం అని అభిప్రాయపడ్డారాయన.