భట్టి విక్రమార్క కామెంట్స్: బంద్ కు మద్దతు... వారం తిరక్కముందే రివర్స్... 

భట్టి విక్రమార్క కామెంట్స్: బంద్ కు మద్దతు... వారం తిరక్కముందే రివర్స్... 

రైతులకు మద్దతుగా ఈరోజు  భట్టి విక్రమార్క ఒకరోజు దీక్ష చేసిన సంగతి తెలిసిందే.  ఈ దీక్ష అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.  బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో దేశంలోకి వచ్చారు.  ఆ తరువాత దేశాన్ని కబళించారు.  ఇలాంటి వ్యాపారాత్మక ధోరణితోనే వ్యవసాయ చట్టాలు ఉన్నాయి.  ప్రధాని మోడీ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని భట్టి దుయ్యబట్టారు.  ప్రతి ఊర్లో రైతు సంఘాలు వెలుస్తాయని భట్టి పేర్కొన్నారు.  తెరాస నాయకులు ఊర్లోకి రాలేని పరిస్థితి ఉందని, తెలంగాణ భూస్వాములకు వ్యతిరేకంగా నిలబడ్డ ప్రాంతం అని భట్టి విక్రమార్క అన్నారు.  

కేసీఆర్ కి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందని, భారత్ బంద్ సమయంలో మద్దతు ఇచ్చిన కేసీఆర్, వారం తిరక్కముందే రివర్స్ అయ్యారని అన్నారు.  చట్టాలు మారలేదుగాని, కేసీఆర్ మాత్రం మారిపోయారని అన్నారు.  రైతు దీక్షలో రైతుల కోసం రూ.4 లక్షల డబ్బులు కలెక్ట్ చేశామని, పార్టీ ఎమ్మెల్యేలు ఒక నెల జీతం కూడా ఇస్తున్నామని అన్నారు.  ఈ మొత్తాన్ని ఢిల్లీకి వెళ్లి రైతులకు అందిస్తామని అన్నారు.