లక్ష ఇండ్లు చూపిస్తా అని...3428 ఇండ్లు మాత్రమే చూపెట్టారు..

 లక్ష ఇండ్లు చూపిస్తా అని...3428 ఇండ్లు మాత్రమే చూపెట్టారు..

డబుల్ బెడ్ రూం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క మరోసారి ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అవే ఇండ్లు..ఇప్పుడు ghmc ఎన్నికల్లో ఇవే ఇండ్లు చూపెట్టి ప్రజల మోసం చేశారన్నారు.  నాకు లక్ష ఇండ్లు చూపిస్తా అని... 3428 ఇండ్లు మాత్రమే చూపెట్టారని మండిపడ్డారు.  గ్రేటర్లో కట్టాల్సిన 96 వేల ఇండ్లకు 3428 ఇండ్లు చూపెట్టారు...మహేశ్వరం నియోజకవర్గంలో ఇండ్లు చూపెట్టి ఇవే గ్రేటర్ ఎన్నికలు అంటున్నారని భట్టి పేర్కొన్నారు. తుక్కుగుడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవే ఇండ్లు చూపెట్టి ఓట్లెసుకున్నారని ఫైర్ అయ్యారు.  గ్రేటర్ లో ఇండ్ల లెక్క తీస్తాం.. జనం ముందు ఉంచుతాం... ఆత్మగౌరవం లేకుండా బతకాల్సిన పరిస్థితి వద్దని ప్రజలకు చెబుతామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని జనాలకి చెప్తామని పేర్కొన్నారు. మనల్ని మోసం చేసే ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.  గ్రేటర్ తర్వాత... వరంగల్, ఖమ్మంలో ఇండ్ల సంఖ్యను కూడా జనాలకు చూపిస్తాం...సీఎం చెప్పిన మాటలు..కట్టిన ఇండ్లు చూపిస్తామని పేర్కొన్నారు.  ఖమ్మంలో ఎన్నికల సమయంలో నాలుగు నెలల్లో ఇండ్లు కట్టిస్తా... కోడి కోయాలి.. కల్లు తో దావతి ఇయ్యాలని కేసీఆర్ చెప్పారు... నాలుగేండ్ల నుండి ఖమ్మం జనం ముదిరిన కోడి... పులిసిన కల్లు తో ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు.