'జగన్‌ వస్తే వైఎస్‌ఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది'

'జగన్‌ వస్తే వైఎస్‌ఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది'

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ప్రాణహిత-చేవెళ్ల పేరుతో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూపొందించిన డిజైన్‌ను కాళేశ్వరం పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రీడిజైనింగ్‌ చేశారని లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల అంచనా వ్యయం భారీ పెరగిందని అన్నారు. ఇప్పుడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ వస్తే.. ప్రాజెక్టు డిజైన్‌ మార్పు వెనుక ఉన్న కుట్రలను ప్రోత్సహించిన వారిగా పరోక్షంగా బాధ్యులవుతారని భట్టి అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌ వస్తే వైఎస్సార్‌ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు.