భవానీ దీక్షలకు వేళాయె...

భవానీ దీక్షలకు వేళాయె...

భవానీ దీక్షలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. మండలం పాటు దీక్షలను ఆచరించే భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించి, ఎరుపు రంగు దుస్తులు ధరించి ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. తొలుత అంతరాలయంలో మూలవిరాట్‌కు పూజలుచేసి పగడాల మాల అలంకరిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి పూజలు నిర్వహించి మహామండపంలోని ఆరో అంతస్తులో ఆర్జిత సేవలు నిర్వహించే ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అమ్మవారి ఉత్సవమూర్తికి మాలధారణ చేసి, అఖండ జ్యోతి ప్రజ్వలన చేసి దీక్షలను లాంఛనంగా ప్రారంభిస్తారు. 41 రోజులపాటు తెలుగు రాష్ట్రాలలో భవానీలు దీక్ష చేస్తారు.