భీమా-కోరేగావ్‌ కేసులో సుప్రీం కీలక తీర్పు

భీమా-కోరేగావ్‌ కేసులో సుప్రీం కీలక తీర్పు

భీమా-కోరేగావ్‌ కేసులో సుప్రీం కోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.ఈ కేసులో నిందితులుగా ఉన్న సురేంద్ర గడ్లింగ్‌, షోమ సేన్‌, సుధీర్‌ ధవాలే, మహేష్‌ రౌత్‌, రోనా విల్సన్‌లకు నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌ బెయిల్‌ లభించదని స్పష్టం చేసింది. ఈ ఐదుగురిపై ఛార్జిషీట్‌ నమోదు చేయడానికి మరింత సమయం కావాలని.. 90 రోజుల డెడ్‌లైన్‌ను సవరించాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. న్యాయస్థానం ససేమిరా అంది. ఈక్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. కేసు ఇవాళ విచారణకు వచ్చింది. కేసు తీవ్రత దృష్ట్యా ఛార్జిషీట్‌ దాఖలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి మరింత సమయం అవసరమని అభిప్రాయపడింది. బాంబై హైకోర్టు తీర్పును కొట్టేసింది.  అయితే ఇప్పటికే పోలీసులు చార్జిషీటు దాఖలు చేసిందున నిందితులు అయిదుగురు ఇక సాధారణ బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.