సంతకాలు ఫోర్జరీ..! జాయింట్‌ కలెక్టర్‌కు భూమా అఖిలప్రియ ఫిర్యాదు..

సంతకాలు ఫోర్జరీ..! జాయింట్‌ కలెక్టర్‌కు భూమా అఖిలప్రియ ఫిర్యాదు..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారంటూ కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. వైసీపీ నాయకులు ఫోర్జరీ చేసి తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకునేటట్లు బెదిరిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ అభ్యర్థులు ఎక్కడా సంతకాలు చేయలేదు... దీనిపై స్పష్టత ఇవ్వాలని జేసీని కోరారు భూమా అఖిలప్రియ.. వైసీపీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు అక్రమ కేసులు బునాయిస్తే మేం కౌంటర్ కేసులు పెడతామని హెచ్చరించిన ఆమె.. ఓట్లు వేయకపోతే పింఛన్లు, ఇళ్లు ఇచ్చేదిలేదని ఆళ్లగడ్డలో వైసీపీ నాయకులు నీచరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాగా, మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై పలు ఆరోపణలు ఉన్నాయి.. కొంతమంది బెదిరించి, భయపెట్టి.. ప్రత్యర్థుల నామినేషన్లు విత్‌డ్రా చేయించారని విమర్శలు ఉన్నాయి.