ఆళ్లగడ్డలో టెన్షన్.. రోడ్డుపై భూమా కుటుంబం ఆందోళన..

ఆళ్లగడ్డలో టెన్షన్.. రోడ్డుపై భూమా కుటుంబం ఆందోళన..

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుచరులను వైసీపీ అభ్యర్థి కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులు... తమ అనుచరులు ఇద్దరిని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గంగుల విజయేంద్ర రెడ్డి కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ రోడ్దుపై వాహనాలు ఆపి భూమా మౌనిక , భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వైసీపీకే వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. తమ అనుచరులని విజయేందర్ రెడ్డి చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అనుచరులని అప్పగించకపోతే గంగుల విజయేందర్ రెడ్డి ఇంటి ముందే ధర్నాకు దిగుతానని వార్నింగ్ ఇచ్చారు మౌనిక. దీంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.