భూమా కుటుంబం అంటే ఏమిటో చూపిస్తాం..!

భూమా కుటుంబం అంటే ఏమిటో చూపిస్తాం..!

మా మనుషుల్ని కిడ్నాప్ చేస్తే మేం గాజులు తొడుక్కుని కూర్చోవాలా? మేం దౌర్జన్యం చేయగలం..! భూమా కుటుంబం అంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.. ఆళ్లగడ్డలో రోడ్డుపై వాహనాన్ని ఆపి తన సోదరి భూమా మౌనికతో కలిసి ఆందోళనకు దిగిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ వాళ్లు ఆళ్లగడ్డలో రౌడీయిజం చేయాలని చూస్తే మేం కూడా రౌడీయిజం చేస్తాం.. మేమేంటో చూపించాల్సి వస్తుందన్నారు. మేం శాంతి కోసం ప్రయత్నిస్తుంటే మమ్మల్ని రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జగత్ విఖ్యాత్ రెడ్డి... కిడ్నాప్ చేసిన మా మనుషులను తిరిగి అప్పగించకపోతే మేం అంటే ఏమిటో చూపిస్తామన్నారు. 

మరోవైపు మా అనుచరుల్ని చంపడానికి వైసీపీ అభ్యర్ధి విజయేంద్ర రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు భూమా మౌనిక.. మా వాళ్లని వెంటనే విడిచి పెట్టకపోతే విజయేందర్ రెడ్డి ఇంటి ముందే ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆడపిల్లలమని కూడా చూడకుండా మా మీద రాళ్లదాడి చేయించారని మండిపడ్డ మౌనిక.. నా కారు అద్దాలు కూడా పగులగొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు... మేం బెదిరిస్తే బెదిరిపోయేవాళ్లం కాదన్న భూమా మౌనిక... భూమా ఫ్యామిలీ అంటే ఏమిటో రాయలసీమకు మొత్తం తెలుసన్నారు.