ప్రపంచంలోనే ఉన్నతమైన దళారి చంద్రబాబు...

ప్రపంచంలోనే ఉన్నతమైన దళారి చంద్రబాబు...

ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన దళారి ఏపీ సీఎం చంద్రబాబు అంటూ విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి... ఈ విషయం ఎయిర్ ఏసియా స్కామ్‌తో తెలిసిపోయిందన్నారు. ఎయిర్ ఏసియా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న దీపక్ తల్వార్ సంభాషణల్లో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. చంద్రబాబు సమర్ధుడు, మోడీ కంటే బలవంతుడు, అడ్డదారిలో ఏ పనైనా చేయగలడని తేలిందని... చంద్రబాబు లా ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తి మరొకరు లేరని తేలిపోయిందన్నారు. ఏపీకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచానికి ఇలాంటి వ్యక్తి దళారిగా దొరకటం అదృష్టంగా భావిస్తున్నారని... రెండు రోజులక్రితమే ఈ వ్యవహారం బయటకు వస్తే చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేస్తూ అసలు విషయాన్ని పట్టించుకోవడంలేదన్నారు. 

ఏయిర్ ఏసియా వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించినా వార్తలు లేవు... కానీ, లోకేష్ ట్వీట్లపై రెండు రోజులుగా కథనాలు వండి వడ్డిస్తున్నారని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి... ఏయిర్ ఏసియా వ్యవహారం ప్రక్కదారిపట్టించేందుకే మీటింగులు పెట్టి 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో నా అంత నీతిమంతుడు లేడని చెప్పుకుంటున్నారన్నారు. 2019కి ఏం చేస్తావన్న ప్రశ్నకు సీఎం దగ్గర సమాధానం లేక 2029లో దేశంలో... 2059 వరకు ప్రపంచంలో ఫస్ట్ అని చెబుతారంటూ సెటైర్లు వేశారు. వాచ్, ఉంగరం కూడా లేదంటే ఆ రెండు ఉన్నవారికి సత్ప్రవర్తన లేవంటారా? అని చంద్రబాబును ప్రశ్నించారాయన. వాచీ కట్టుకున్నారని గాంధీని కూడా తప్పుపడతారా? ఆ రెండు త్యజించినంత మాత్రాన మీరు మంచివారా? అంటూ ఎద్దేవా చేశారు భూమన. మా కష్టాలు తీర్చాడన్న భావన ఐదుకోట్ల ప్రజల్లో ఏ ఒక్కరిలో లేకపోవటం మీ పాలనకు నిదర్శనమన్నారు భూమన... ఎంత సేపు జగన్ జైలుకు వెళ్లటం గురించే మాట్లాడుతున్నారు... జైలుకు వెళ్లింది నీ వలన, సీబీఐ కేసు నీ వలనే, సోనియాతో కుమ్మక్కై సీబీఐని ఊరకుక్కల్లా ఉసిగొలిపింది నీవు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలన్న రమణ దీక్షితులు సవాలు ఏపీ సీఎం స్వీకరించాలని డిమాండ్ చేశారు భూమన.