ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా 'యాత్ర' పేరుతో సినిమా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్ స్నేహితుడు కేవీపీ పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. ఇందులో కొన్ని కీలక పాత్రలు ఉన్నాయని అందులో ఒకటి వైఎస్ కూతురు షర్మిల పాత్ర ఉందట. ఆ పాత్రకోసం యూనిట్ భూమికను సంప్రదించారట. కానీ, భూమిక అందుకు అంగీకారం తేలిందా లేదా అన్నది తెలియాలి.
వైఎస్ బయోపిక్ లో షర్మిల, భారతి, వైఎస్ జగన్ కు సంబంధించిన సన్నివేశాలు ఉండవట. వైఎస్ పాదయాత్ర, అధికారంలోకి ఎలా వచ్చారు. రాష్ట్రాన్ని ఎలా పరిపాలన సాగించారు అనే విషయాలు మాత్రమే ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది.
తెలుగులో ఇటీవలే వచ్చిన మహానటి తరువాత బయోపిక్ లు వరసగా వస్తున్నాయి. వైఎస్ బయోపిక్ రెడీ అవుతుండగా.. అటు ఎన్టీఆర్ జీవిత కథకు సంబంధించిన సినిమాను కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా మరికొన్ని జీవిత కథలపై చర్చలు జరుగుతున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)