సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నుంచి తప్పుకున్న భూపేందర్‌ సింగ్‌

సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నుంచి తప్పుకున్న భూపేందర్‌ సింగ్‌

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చట్టాలపై ఓ కమిటీని కూడా సుప్రీం కోర్టు వేసింది. అయితే... కమిటీలోని సభ్యులంతా ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చేవారేనని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నుంచి భూపేందర్‌ సింగ్‌ తప్పుకున్నారు. వ్యవసాయ చట్టాలపై ఇటీవలే కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఈ నేపథ్యంలో నలుగురు సభ్యుల కమిటీ నుంచి తప్పుకున్నారు భూపేందర్‌సింగ్‌ మాన్‌. దీనిపై ఆయన స్పందిస్తూ...తన నియామకంపై రైతు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో చర్చల కమిటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు.. రైతుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని పేర్కొన్నారు.