ఇప్పుడు 5 కోట్లు అందుకుంటున్న భువీ మొదటి సంపాదన ఎంతంటే...?

ఇప్పుడు 5 కోట్లు అందుకుంటున్న భువీ మొదటి సంపాదన ఎంతంటే...?

భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ గురించి అందరికి తెలుసు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండే  భువీ ఈ మధ్య ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అయితే అందులో ఓ అభిమాని “మీ మొదటి సంపాదన ఎంత? మీరు దానితో ఏమి చేశారో మీకు గుర్తుందా? అని ప్రశ్నించాడు. ఇక దానికి సమాధానంగా.. నా మొదటి సంపాదన 3000, నేను దానిలో కొంచెం షాపింగ్ చేశాను, మరికొన్నింటిని ఆదా చేసుకున్నాను" అని తెలిపాడు. అయితే ప్రస్తుతం భారత జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉన్న భువనేశ్వర్ 2012 లో పాకిస్థాన్ పై జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసాడు. ఇక గత ఏడాది వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో గాయపడ్డ తాను మళ్ళీ ఇప్పటివరకు క్రికెట్ఆడలేదు. అయితే బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఏ గ్రేడ్ లో నిలిచాడు. అంటే బీసీసీఐ నుండి అతను ఏడాదికి 5 కోట్లు అందుకుంటున్నాడు.