బీబీనగర్ ఎయిమ్స్‌లో మెడికల్‌ కాలేజీ

బీబీనగర్ ఎయిమ్స్‌లో మెడికల్‌ కాలేజీ

హైదరాబాద్‌ నగర శివార్లలోని బీబీ నగర్‌లో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్‌లో 750 పడకల హాస్పిటల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌, మధురైలో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్‌లో వివిధ రకాల విభాగాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఎయిమ్స్‌లో వంద సీట్ల మెడికల్‌ కాలేజీతో పాటు 60 బీఎస్సీ సీట్లతో (నర్సింగ్‌ కాలేజీ)ని ఏర్పాటు చేస్తారు. ఎయిమ్స్‌లో మొత్తం  11 స్పెషాలిటీ విభాగాలతో పాటు  15 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లు ఉంటాయి.  స్పెషాలిటీ డిపార్ట్ మెంట్ పరిధిలో సర్జికల్ స్పెషాలిటీ విభాగంలో 120 బెడ్స్, మెడిసన్ విభాగంలో 165 బెడ్లు, గైనకాలజీకి 75 బెడ్స్ కలిపి మొత్తం 360 బెడ్లు ఈ విభాగాలకు కేటాయించారు.  సూపర్ స్పెషాలిటీ పరిధిలో  215 బెడ్లు కేటాయించారు. రెండు విభాగాలకు కలిపి మొత్తం 575 బెడ్లు కేటాయించారు. ఇక ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు 75 బెడ్లు, ట్రౌమాకేర్‌కు 30 బెడ్లు, ఆయుష్ ఫెసిలిటికి 30 బెడ్లు, పిఎంఆర్ డిపార్ట్ మెంట్‌కు 10, పెయిడ్ బెడ్లకు గాను 30 బెడ్స్‌ కేటాయించారు.