ఏప్రిల్ 2020 నుంచి మారుతి సుజుకీ డీజిల్ కార్ల అమ్మకం బంద్!!

ఏప్రిల్ 2020 నుంచి మారుతి సుజుకీ డీజిల్ కార్ల అమ్మకం బంద్!!

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా గురువారం ఓ కీలక ప్రకటన చేసింది. 1 ఏప్రిల్ 2020 నుంచి భారత్ లో డీజిల్ కార్ల అమ్మడం ఆపేస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 1, 2020 నుంచి కంపెనీ డీజిల్ కార్లను అమ్మబోదని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్ సి భార్గవ చెప్పారు.

ప్రస్తుతం కంపెనీ అనేక మోడళ్ల డీజిల్ వాహనాలను అమ్ముతోంది. దేశీయ మార్కెట్లో కంపెనీ అమ్మే వాహనాల్లో డీజిల్ వాహనాల వాటా దాదాపు 23 శాతంగా ఉంది. 

గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మారుతి సుజుకి నికర లాభం 4.6 శాతం తగ్గి రూ.1,795.6 కోట్లుగా ఉంది. అమ్మకాల్లో కూడా సాధారణ పెరుగుదల నమోదైంది. దీంతో మొత్తం అమ్మకాలు రూ.20,737.5 కోట్లు మాత్రమే జరిగాయి. నాలుగో త్రైమాసికంలో నికర లాభం గురించి ప్రకటిస్తూ వచ్చే ఏడాది నుంచి డీజిల్ కార్లు అమ్మబోమని మారుతి తెలిపింది.

ఇకపై డీజిల్ కార్లకు బదులు మారుతి తమ పెట్రోల్, సీఎన్జీ కార్లపై దృష్టి పెట్టనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే మారుతి కొన్ని కొత్త మోడళ్లను సీఎన్జీ వేరియంట్ తో ప్రవేశపెట్టవచ్చని అంటున్నారు.