ఇషా అంబాని రిసెప్షన్ లో బిగ్ బి సర్ప్రైజ్ ..!!

ఇషా అంబాని రిసెప్షన్ లో బిగ్ బి సర్ప్రైజ్ ..!!

ఇషా అంబాని వివాహం ఈనెల 12 వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ వేడుకకు బాలీవుడ్ నుంచే కాకుండా.. ఇతర సినిమా ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు.  వివాహం అనంతరం రిసెప్షన్ ను భారీ ఎత్తున ఏర్పాటు చేసింది.  ఈ వేడుకలో చాలా మంది సెలెబ్రిటీలు పాల్గొన్నారు.  

ఇదిలా ఉంటె, ఈ రిసెప్షన్ వేడుకలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ సర్ప్రైజ్ ఇచ్చాడు.  విందులో పాల్గొన్న అతిధులకు బిగ్ బి స్వయంగా వడ్డన చేశారు.  తన స్టార్ హోదాను పక్కన పెట్టి వడ్డన చేయడం విశేషం.  అమితాబ్ వడ్డన చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.