బిగ్‌బాస్‌-4: గంగవ్వకు అస్వస్థత..!

బిగ్‌బాస్‌-4: గంగవ్వకు అస్వస్థత..!

బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తానని చెబుతూ వస్తున్న గంగవ్వ అస్వస్థతకు గురయ్యారు. గంగవ్వను కన్ఫెషన్ రూమ్‌కు పిలిపించి నీ ఆరోగ్యం గురించి బెంగ పడొద్దు. మీరు త్వరగా కోలుకొంటారు అని బిగ్‌బాస్ హామీ ఇచ్చారు. అయితే నన్ను బాగా చూసుకొంటున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నాకు ఈ వాతావరణం పడటం లేదు అంటూ గంగవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు తండ్రి, భర్త, నాకంటూ ఎవరూ లేరు అంటూ గంగవ్వ ఏడ్చింది. దాంతో మీ ఆరోగ్యం విషయంలో కంగారు పడొద్దు. మీ ఆరోగ్యం గురించి డాక్టర్లు చూసుకుంటారు అని బిగ్‌బాస్ చెప్పారు.

తనకు కాళ్లలో నొప్పులు ఉంటాయని, ఆరోగ్యం సరిగా ఉండటం లేదు అని గంగవ్వ వివరించింది.  దాంతో ఇక్కడి వచ్చిన వారందరికి కొత్తలో ఇలానే ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు. కొద్ది రోజులు ఆగితే తగ్గిపోతుందని మీరు గట్టి మనిషి. మీ గురించి బిగ్‌బాస్‌కు బాగా తెలుసు. మీరు టైమ్‌కు మందులు వేసుకోండి. డాక్టర్లు మీ ఆరోగ్యాన్ని చూసుకొంటారు. మీరు నేరుగా డాక్టర్ వద్దకు వెళ్లండి అని చెప్పగా గంగవ్వ లాస్య సహాయంతో గంగవ్వ డాక్టర్ రూమ్‌కు వెళ్ళింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న గంగవ్వ కారణంగా పల్లెల్లో సైతం బిగ్ బాస్ చుసేవారి సంఖ్య పెరిగి పోయింది. ఇలాంటి సమయంలో గంగవ్వ బిగ్ బాస్ నుండి వెళ్లిపోతే షో చూసేవారి సంఖ్య తగ్గిపోయే అవకాశం కూడా ఉంది.