తెర‌వెన‌క‌: బ‌న్నిలో బిగ్ ఛేంజ్‌?

తెర‌వెన‌క‌: బ‌న్నిలో బిగ్ ఛేంజ్‌?
ప‌రిశ్ర‌మ‌లో పోటీ అన్న‌ది అండ‌ర్‌క‌రెంట్ ఆప‌రేష‌న్ లాంటిది! అది సైలెంటుగా ర‌న్ అవుతుంటుంది. పైపైకి మాలో పోటీ ఏంటి? అని కొట్టి పారేసినా.. హీరోలు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డ‌డం అన్న‌ది త‌ప్ప‌నిస‌రి. అయితే అది ఆరోగ్య‌క‌ర‌మైన పోటీత‌త్వం అనే చెప్పాలి. ఒక హీరో రికార్డుల్ని ఇంకో హీరో బ్రేక్ చేయ‌డం, ఆ త‌ర‌వాత ఆ రికార్డుల్ని తిరిగి బ్రేక్ చేసేందుకు వేరే హీరో హార్డ్ వ‌ర్క్ చేయ‌డం అన్న‌ది ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌య‌త్నంగానే చూడాలి. ఆ కోవ‌లో చూస్తే, ప‌రిశ్ర‌మ‌లో ఆ అర‌డ‌జ‌ను హీరోల మ‌ధ్య కాంపిటీష‌న్ వార్ ఎప్ప‌టికీ న‌డిచేదే. ప్ర‌స్తుతం మ‌న హీరోలంతా నాన్ బాహుబ‌లి రికార్డుల్ని బ్రేక్ చేసే ప‌నిలోనే ఉన్నారు. చాలా గ్యాప్ త‌ర‌వాత రామ్‌చ‌ర‌ణ్ త‌న స్థాయి ఏంటో ట్రేడ్ వ‌ర్గాల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాడు. `రంగ‌స్థ‌లం` విజ‌యంతో చ‌ర‌ణ్ గ్రాఫ్ టాప్‌స్లాట్‌లోకి చేరింది. అయితే ఇన్నాళ్లుగా సాఫీగా కెరీర్ బండిని న‌డిపిస్తూ, చ‌క్క‌ని స‌క్సెస్ రేటుతో ముందుకు సాగుతున్న అల్లు అర్జున్ `రంగ‌స్థ‌లం` రికార్డులు చూశాక మ‌రింత‌గా త‌న‌ని తాను నిరూపించుకునే స‌న్నాహాల్లో ఉన్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. ఆ క్ర‌మంలోనే బ‌న్ని ప్లానింగ్స్‌లో భారీ మార్పులు క‌నిపిస్తున్నాయ‌ట‌. అస‌లే పోటీప‌డేత‌త్వం.. ఆపై రాజీకి రాని వ్య‌వ‌హారం కావ‌డంతో అత‌డి ప్లాన్స్‌లో అనూహ్య మార్పులు వ‌చ్చాయ‌ట‌. వాస్త‌వానికి `నా పేరు సూర్య` త‌ర‌వాత ఓ అప్‌కం ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చాడు. కానీ మారిన స‌న్నివేశంలో ఇప్పుడు బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ కొర‌టాల‌తో సినిమా చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ట‌. `భ‌ర‌త్ అనే నేను` ప్రీటాక్ విన్నాక‌.. ఇప్ప‌టికే అల్లు కాంపౌండ్ కొర‌టాల‌తో బాగా ట‌చ్‌లో ఉంద‌ని తెలుస్తోంది. అయితే మునుముందు అస‌లేం జ‌ర‌గ‌బోతోంది? కొర‌టాల త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అన్న‌ది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదివ‌ర‌కూ ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ల‌తో సినిమాలు క‌మిటైన కొర‌టాల బ‌న్నీకి కూడా క‌మిట‌వుతాడా? అన్న‌ది వేచి చూడాలి.