నాగార్జున నిజంగానే కింగ్ అనిపించుకున్నాడు !

నాగార్జున నిజంగానే కింగ్ అనిపించుకున్నాడు !

నాగార్జున సినిమాలంటే కుటుంబ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.  అందుకే ఆయన సినిమాల శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడవవుతుంటాయి.  నానితో కలిసి అయన నటిస్తున్న కొత్త సినిమా 'దేవదాస్' శాటిలైట్ హక్కులు 15 కోట్ల భారీ మొత్తానికి అమ్మడైనట్టు తెలుస్తోంది.

ఈ భారీ డీల్ తో నాగార్జున నిజంగానే కింగ్ అని మరోసారి నిరూపించుకున్నారు.  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదలకానుంది.