చరణ్, ఎన్టీఆర్ సినిమాకు 150 కోట్లు !

చరణ్, ఎన్టీఆర్ సినిమాకు 150 కోట్లు !

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  సినిమాకి ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ డిమాండ్ ఉంది.  రాజమౌళి డైరెక్షన్ కావడంతో ఒక్క సౌత్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా హిందీ పరిశ్రమ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తోంది.  అందుకే జీ టీవీ సంస్థ ఈ సినిమా యొక్క హిందీ, తెలుగు, తమిళం శాటిలైట్ హక్కులకు 150 కోట్లు చెల్లిస్తామని ముందుకొచ్చిందని వినికిడి.  అయితే నిర్మాత దానయ్య ఇంకా డీల్ ఓకే చేయలేదని అంటున్నారు.   షెడ్యూల్ మొదలుకాగా ఈ ఏడాది చివరికి షూట్ మొత్తం పూర్తయ్యే అవకాశముంది.