తిరుమలేశుడికి భారీ విరాళం...

తిరుమలేశుడికి భారీ విరాళం...

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రవాస భారతీయులు భారీ విరాళాన్ని అందజేశారు. అమెరికాలో స్థిరపడిన ఏపీకి చెందిన శ్రీనివాస్‌, రవి అనే భక్తులు ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని... టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.13.50 కోట్ల విరాళాన్ని సమర్పించారు. మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సమక్షంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌కు ఈ విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు భక్తులు శ్రీనివాస్, రవి. తిరుమల శ్రీవారికి మొత్తం రూ.13.50 కోట్లు విరాళంగా అందజేశారు ఎన్‌ఐఆర్‌లు. టీటీడీలోని వివిధ ట్రస్టులకు శ్రీనివాస్ రూ.3.50 కోట్లు విరాళం ఇవ్వగా... రవి రూ.10 కోట్లు అందజేశారు.