ఈ రాత్రంతా జాగరమే..!!

ఈ రాత్రంతా జాగరమే..!!

చీకటి పడితే చలి చంపేస్తున్నది.  చలితో నగరాలు గజగజ వణుకుతున్నాయి.  ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.  ఇప్పుడు చెన్నైలో అలాంటి వాతావరణం కనిపించడం లేదు.  నగరంలో ఈ మధ్యాహ్నం నుంచే ఎక్కడ చూసిన జనసందోహమే కనిపిస్తోంది.  దానికి కారణం లేకపోలేదు.  జనవరి 10 వ తేదీన సూపర్ స్టార్ రజినీకాంత్ పెట్ట, మరో స్టార్ హీరో అజిత్ కుమార్ విశ్వాసం సినిమా రిలీజ్ అవుతున్నాయి.  ఈ రెండు సినిమాలతో ఆ రాష్ట్రంలోని థియేటర్లు అన్ని నిండిపోయాయి.  చెన్నైలో ఈ రెండు సినిమాల మధ్య భారీ ఫైట్ జరగబోతున్నది.  

పెట్ట, విశ్వాసం రెండింటికి పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో.. అంచనాలు పెరిగాయి.  రెండు సినిమాల ప్రీమియర్, బెనిఫిట్ షోలు ఆ అర్ధరాత్రి నుంచే ప్రారంభం కాబోతున్నాయి.  ఈ తరుణంలో తమ అభిమాన హీరోల సినిమాలు చూసేందుకు చెన్నై నగరానికి చేరుకుంటున్నారు.  ఇప్పుడు చెన్నైలో ఎక్కడ చూసిన పండగ వాతావరణమే కనిపిస్తోంది.  ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.