ఏప్రిల్ లో భారీ పోటీ...!!

ఏప్రిల్ లో భారీ పోటీ...!!

ఏప్రిల్ నెలలో.. అంతా బిజీ బిజీగా ఉండే మాసం.  2019 ఏప్రిల్ మరింత బిజీగా మారనుంది.  ఒకవైపు పరీక్షలు, మరోవైపు ఐపీఎల్, ఇంకోవైపు ఎన్నికలు.. ఇంకోవైపు సినిమాలు.  ఇలా అన్నింటితో ఆ నెలంతా బిజీగా మారబోతున్నది.  సినిమా విషయానికి వస్తే.. ఏప్రిల్ 5 వ తేదీన నాగ చైతన్య మజిలీ రిలీజ్ కాబోతున్నది.  మజిలీకి మంచి హైప్ వచ్చింది.  రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ వావ్ అనిపించే విధంగా ఉంది.  అంతేకాదు, వన్ బాయ్ వన్ గర్ల్ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.  హిట్ ఖాయం అని అభిమానులు అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు.  

ఈ సినిమా తరువాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి రిలీజ్ అవుతుంది.  డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమౌతున్న సాయి ధరమ్ తేజ్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.  సినిమాకు పాజిటివ్ హైప్ వస్తోంది.  దీని తరువాత ఏప్రిల్ 19 న నాని జెర్సీ రిలీజ్ కాబోతున్నది.  అఫీషియల్ గా డేట్ ను అనౌన్స్ చేశారు.  స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.  

ఇక మహేష్ బాబు మహర్షి సినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన సినిమాను మే 9 కి పోస్ట్ ఫోన్ చేశారు.  ఇదే అవకాశంగా భావించిన బెల్లంకొండ శ్రీనివాస్ ఏప్రిల్ 25 ను రిజర్వ్ చేసుకున్నారు.  బెల్లంకొండ.. కాజల్ జంటగా నటించిన సీత సినిమా ఆరోజున రిలీజ్ కాబోతున్నది.  నేనే మంత్రి నేనే రాజు తరువాత తేజ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.  ఈ సినిమాలతో పాటు మరికొన్ని కూడా అదే నెలలో రిలీజ్ కాబోతున్నాయి.  వీటిల్లో ఎన్ని సక్సెస్ అవుతాయో చూడాలి.