ఐపీఎల్ 2021 : కోల్‌కతాకు మరో షాక్‌..

ఐపీఎల్ 2021 : కోల్‌కతాకు మరో షాక్‌..

ముంబై  వేదికగా నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్‌కత నైట్ రైడర్స్ పైన చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు చెన్నై పేసర్ దీపక్ చాహర్ గట్టి షాక్ ఇచ్చాడు. చాహర్ దెబ్బకు కోల్‌కత టాప్ ఆర్డర్ మొత్తం విలవిలలాడిపోయింది.  కేకేఆర్ 19.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. దాంతో చెన్నై 18 పరుగుల తేడాతో ఈ ఐపీఎల్ లో మూడో విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. అయితే ఓటమి బాధలో ఉన్న కోలకతా కు మరో షాక్ తగిలింది. ముంబై  వేదికగా జరిగిన పోరులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఐపిఎల్ 2021 లో స్లో ఓవర్లు వేసినందుకు ఇప్పటికే చెన్నై కెప్టెన్ ధోనీ, ముంబై కెప్టెన్ రోహిత్ లకు జరిమానా పడింది. తాజాగా  కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు జరిమానా పడింది.