శ్రీవారి భక్తులకు షాక్ ..

శ్రీవారి భక్తులకు షాక్ ..

తిరుమల శ్రీవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది.   కరోనా కేసులు పెరుగుతూ వుండడంతో దర్శనాల సంఖ్య తగ్గించింది టిటిడి.  అలిపిరి వద్ద ప్రతి రోజూ జారీ చేసే 20 వేల సర్వదర్శనం టోకేన్లను  నిలిపివేసింది టిటిడి.  ఆన్ లైన్ లో నిత్యం 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విక్రయించినా ...భక్తులు నుంచి స్పందన  తగ్గింది.  పరిస్థితిని బట్టి దర్శన టికెట్ల సంఖ్యను తగ్గించే యోచనలో ఉంది టిటిడి.  ఇప్పటికే పురావస్తు శాఖ ఆదేశాల మేరకు టిటిడి ఆధ్వర్యంలోని ఒంటిమిట్ట, శ్రీనివాస మంగాపురం ఆలయాలను మూసివేసింది టిటిడి. కాగా అటు ఏపీలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 35,907 సాంపిల్స్ ని ప‌రీక్షించ‌గా.. 7,224 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే ఈ వైరస్ కారణంగా 15 మంది మృతిచెందారు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో 2,332 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నార‌ని.. నేటి వరకు రాష్ట్రంలో 1,56,42,070 సాం పిల్స్ ని ప‌రీక్షించామ‌ని బులెటిన్‌లో పేర్కొంది స‌ర్కార్. ఇక‌, క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 955455 కు చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 40469 గా ఉన్నాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు 907598 మంది రిక‌వ‌రీ కాగా..  7388 మంది కోవిడ్‌తో మృతిచెందారు.