ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ముందస్తు గిఫ్ట్ !

ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ముందస్తు గిఫ్ట్ !

రేపు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా సినిమాను ఒక బిగ్ సప్రైజ్ బయటకురానున్న సంగతి తెలిసిందే.  అయితే దానికంటే ముందే ఈరోజు సాయంత్రం కొత్త పోస్టర్ రూపంలో ముందస్తు సప్రైజ్ అభిమానుల కోసం రానుందట.  ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన ఏదీ బయటకురాకపోయినా పోస్టర్ విడుదల ఖాయమని అంటున్నారు. 

యువీ క్రియేషన్స్ బ్యానర్ 150 కోట్ల హెవీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా ఉండనుంది.  సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ కథానాయకిగా నటిస్తోంది.  బాహుబలి తరవాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడ భారీ అంచనాలున్నాయి.