'సాహో' నుండి బిగ్ అప్డేట్ !

'సాహో' నుండి బిగ్ అప్డేట్ !

 

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం 'సాహో' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  తాజా సమాచారం మేరకు ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ ముగిసినట్టు తెలుస్తోంది.  ఇంకో మూడు పాటలు చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందట.  వాటిని కూడా త్వరగా ముగించేసి ముందుగా ప్రకటించిన ఆగష్టు 15నాడే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  సుమారు 250 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రద్ద కపూర్ కథానాయకిగా నటిస్తోంది.  సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.