బిగ్ బాస్ హౌస్‌లోకి చరణ్ భామ..!

బిగ్ బాస్ హౌస్‌లోకి చరణ్ భామ..!

బిగ్ బాస్ హౌస్ లోకి రాంచరణ్ హీరోయిన్ నేహా శర్మ ఎంట్రీ ఇవ్వనున్నారు. చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసింది. అయితే నేహా శర్మ వెళ్ళేది తెలుగు బిగ్ బాస్ లోకి కాదండీ.. హిందీ బిస్ బాస్ సీజన్ 14లోకి. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న హిందీ బిగ్ బాస్ ఎంత పెద్ద హిట్ షోనో అందరికి తెలిసిందే. ఈ షో అక్టోబర్ 1న మొదటి ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే ఈ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ లిస్టును నిర్వాహకులు సిద్ధం చేశారు. జాస్మిన్ భాసిన్, నిశాంత్ సింగ్ మాల్కని, నేహ శర్మ, ఇజాజ్ ఖాన్, పవిత్ర పునై, నైనా సింగ్, కుమార్ జానూ, అలీ గొనీ, రాహుల్ వైద్య, కరణ్ పటేల్, స్నేహ ఉల్లాల్, క్యారీ మినాటీ(యూట్యూబర్)తో పాటు మరో ముగ్గురు యూట్యూబర్ ఈ ఏడాది కంటెస్టెంట్లుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. వీరితో పాటు మాజీ బిగ్ బాస్ విన్నర్స్ హినా ఖాన్, గౌహర్ ఖాన్, సిద్ధార్థ్ శుక్లాలను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.