బిగ్ బాస్ లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!

బిగ్ బాస్ లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!

బిగ్ బాస్-4 ప్రారంభమైనప్పటి నుండి మంచి రేటింగ్ తో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కంట్రీలోనే ఎక్కువ రేటింగ్ తెలుగు బిగ్ బాస్ కి వచ్చిందని పేర్కొన్నారు. అయితే తాజాగా ఐపీఎల్ మొదలవ్వడం తో బిగ్ బాస్ జోష్ తగ్గిపోతుందని టాక్ వినిపిస్తోంది. దాంతో బిగ్ బాస్ నిర్వహకులు సైతం రేటింగ్ పడిపోయే ఛాన్స్ ఉందని గ్రహించినట్టున్నారు. దాంతో ఇప్పటికే మొదటి రెండు వారాల్లో ఇద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షో లోకి పంపించారు. ఇక ఇప్పుడు మరో కంటెస్టెంట్ ను కూడా హౌస్ లోకి పంపిస్తారని ప్రచారం నడుస్తోంది. ఐపీఎల్ ను ఢీకొట్టేందుకు హాట్ హీరోయిన్ ను హౌస్ లోకి పంపించనున్నారట. జంప్ జిలానీ హీరోయిన్ స్వాతి దీక్షితే ను హౌస్ లోకి పంపించనున్నట్టు సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లిన ముక్కు అవినాష్ హౌస్ మేట్స్ కు దగ్గరైపోగా కుమార్ సాయి మాత్రం హౌస్ మేట్స్ తో కలిసిపోలేదు.