ప్రపంచంలోనే అతి పెద్ద శ్యాంసంగ్ షోరూమ్‌

ప్రపంచంలోనే అతి పెద్ద శ్యాంసంగ్ షోరూమ్‌

వంద కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్న భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను సుస్థిరం చేసుకునేందుకు శ్యాంసంగ్ వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ షోరూమ్ కమ్ ప్లాంట్ ను అందరికన్నా ముందుగా బెంగళూరులో ప్రారంభించింది. ప్రైమ్ లొకేషన్లో సువిశాలమైన స్పేస్ లో ప్రారంభించిన ఈ షో రూమ్ లో  మొబైల్ సెట్లే కాకుండా కంపెనీకి సంబంధించిన ఇతర ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా అందుబాటులో ఉంచుతామని ప్రతినిధులు చెబుతున్నారు. ఇలాంటి భారీ షో రూములే ఇండియాలోని టాప్ టెన్ సిటీస్ లో ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నామని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ రంగంలో చైనా నుంచి పోటీని తట్టుకోవడంతో పాటు చాలా పరిమితమైన అమ్మకాలున్న ఆపిల్ కంపెనీని ఆదిలోనే అడ్డుకునే వ్యూహంతో దక్షిణ కొరియా కంపెనీ దూసుకుపోతోంది. అంతేకాకుండా బెంగళూరులోని సెంటర్ ను స్టార్టప్స్ కు మీటింగ్ పాయింట్ గా అభివృద్ధి చేసేందుకు వెంచర్ క్యాపిటలిస్టుల కోసం కూడా అన్వేషిస్తున్నారు.