న్యూజిలాండ్‌లో ఇదే పెద్ద విజయం

న్యూజిలాండ్‌లో ఇదే పెద్ద విజయం

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే న్యూజిలాండ్‌లో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. మార్చి 2009లో హామిల్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 84 పరుగుల తేడా (డక్ వర్త్ లూయిస్ పద్దతిలో)తో భారత్ ఓడించింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ విజయాన్ని సవరించింది భారత్. సోమవారం ఉదయం భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో వన్డే మౌంట్‌ మాంగనీ మైదానంలో జరగనుంది.